కర్షకుడి సమరభేరి (Telugu)

Sri Vibhav J

The poem addresses the difficulties faced by farmers and the forbearence that they exhibit while fighting against those problems.

వరదలు, కరువులు, తుఫానులొచ్చి
చేతిన కాపు కొట్టుకుపోతే
నాగలిని నీ బాహువుకెత్తి
ప్రకృతితోనే రణం చేతువే..!

పందులు, ఎలుకలు , మిడతలతోడు
హయాలు కూడా పంటను మేస్తే
ఆశ వదలక భూమి విడువక
సహనానికి ప్రతిరూపం నీవై..

ఎండ, వాన, గాలి, ధూలి
దేనిని లెక్కచేయక
హలానికి నీ బలాన్ని తోడి
ప్రకృతి తోనే రణం చేతువే..!

నీ కష్టం ఎరుగని పెద్దమనుషులు
నీ కృషికి కనీస మద్దతు ఇవ్వక
నీ కడుపు మీద కొడితే ..
వాడి కడుపు కూడా నీవే నింపుతావ్..!
సద్గునశీలి,దయాసంపన్నుడా,ఓ కర్షకుడా...

ఇన్ని జరిగినా నిరాశఛాయలు తాకనివ్వని నీ సంకల్పానికి జోహార్లు
పైసా కోసం పరుగులు తీసే పిసినారి ప్రపంచానికి నీ సాహసమే ఒక ఉదాహరణ
నీ వెన్నుతో దున్నే పొలంలో పండే ప్రతి మెతుకుకి నీవే మాలిక్
పొరాడు నీ హక్కుకై..!!

హస్తినలో నువ్వు చేసే ఒంటరి పోరుకు నేనూ తోడు
నా శక్తి, యుక్తి, కలం, గళం, బలం, సకలం నీకు అంకితం
నీతో నే నిలబడతా ..!
నీకై నే నిలబడతా..!

Top