The modern man (Telugu)

G V Tarun Kumar

Join the poet on his commentary on the lifestyle and vanity of humans, and where it went wrong

ఓ మనిషి!!!

ఓ మనిషి అవుకు జీవిత పోరాటంలో ఒక మరమనిషి!

చందమామపై కాలుమోపిన నీవు అమ్మ పాడే చందమామ పాటను మరిచావా!

రాయిలో దేవుని చూసిన నీవు మానవునిలో మాధవుని చూడలేక పోతున్నావా!

ఆకలి తీర్చే అన్నదాత ఆకలి కేకలు వినబడలేదా!

చేసావు విద్యని అంగడి సరుకు, మూసావు మనసులో నైతిక విలువల తలుపు!

ఉండవుగా ప్రకృతి తల్లికి కులమత బేధాలు, అందుకే నాశనం చేస్తున్నావా ఆమె సంపదలు!

వంద నోటుకు ఉన్న విలువకూడా వేలమంది ప్రాణాలర్పించి నిలబెట్టిన జాతీయ జెండాకు ఇవ్వట్లేదు నేడు!

నీ కళ్ళకు ప్రపంచ వెలుగు చూపిన అమ్మ జాతి కళ్ళు నేడు ఈ ప్రపంచమనే చీకటిలో వెలుగు కోసం ఎదురు చూస్తున్నాయి!

జన్మనిచ్చిన తల్లిజాతికే జన్మ లేకుండా చేస్తున్నావు!

ఓ మనిషి అవుకు జీవిత పోరాటం లో ఒక మరమనిషి!

Top